AP:నేడు POLYCET 2026 పరీక్ష

April 25, 2026 11:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష అయిన POLYCET 2026 నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. భీమిలి పరిధిలోని Avanthi Engineering Collegeలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ పరీక్ష ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10:00 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 11:00 తర్వాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించరు.హాల్ టికెట్ లేని అభ్యర్థులు ఉదయం 7:00 నుంచి 9:00 గంటల మధ్య పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించవచ్చు.ఇక విద్యార్థుల సౌకర్యార్థం Muttamsetti Srinivasa Rao ఆధ్వర్యంలో ఉచిత బస్సు సదుపాయం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఆనందపురం ప్రాంతాల నుంచి బస్సులు ఉదయం 7:30కు బయలుదేరనున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media