ఏప్రిల్ 25న జరుపుకునే World Malaria Day సందర్భంగా మలేరియా నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ Veer Pandyan పిలుపునిచ్చారు.
సిబ్బంది ఇంటింటికి సర్వేలు నిర్వహిస్తూ మలేరియా నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అవగాహన కోసం వాల్ పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు.జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన, “Driven to End Malaria – Now We Can, Now We Must” నినాదంతో ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
