ప్రకృతి ప్రేమికుడు సత్యనారాయణ పై దాడి

April 26, 2026 10:08 AM

ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి నేపథ్యంలో Joginipalli Santosh Kumar నిమ్స్ ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు.

Green India Challenge వ్యవస్థాపకుడైన సంతోష్ కుమార్, వైద్యులతో మాట్లాడి సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.ఈ సందర్భంగా ఇలాంటి దాడులు సమాజానికి మంచివి కాదని, నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని, చివరి శ్వాస వరకు అడవులను కాపాడతానని తెలిపారు. ఈ ఘటనపై పర్యావరణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media