తాడేపల్లిలో అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు

April 26, 2026 9:16 AM

గుంటూరు జిల్లా Tadepalliలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

భరతమాత సెంటర్ వద్ద అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఉదయం సుమారు 5 గంటల సమయంలో జరిగింది.కారు ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కారులో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నట్టు సమాచారం.ఈ వాహనం పోలీస్ శాఖకు సంబంధించినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారులో నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయినట్టు సమాచారం.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media