స్కైరూట్ ఏరోస్పేస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి Revanth Reddy కీలక వ్యాఖ్యలు చేశారు. ఏరోస్పేస్ రంగానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Anand Mahindra ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోందని, ఇందులో అన్ని నైపుణ్య విభాగాలను చేర్చుతామని పేర్కొన్నారు. ఏరోస్పేస్ రంగానికి అవసరమైన మానవ వనరులను ఈ యూనివర్సిటీ ద్వారా తయారు చేస్తామని చెప్పారు.అలాగే ఐటీఐలను Tata Group సహకారంతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ATC) మారుస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మార్చి విద్యా వ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం సుమారు రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు.

