హైదరాబాద్‌లోని Jubilee Hillsలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడిలో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు పెడ్లర్లు, ఒక వినియోగదారుడిని అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి 45 సీసాల హ్యాష్ ఆయిల్, సుమారు 185 గ్రాముల విడిగా ఉన్న మత్తు పదార్థం, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.1,02,500గా పోలీసులు తెలిపారు.ప్రధాన నిందితుడు విశాఖపట్నం సమీపంలోని అరకు ప్రాంతం నుంచి హ్యాష్ ఆయిల్ సేకరించి హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.డ్రగ్స్ సమాజానికి ప్రమాదకరమని, యువత వీటి బారిన పడవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
