దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసం రాకెట్‌ను Hyderabad City Police “ఆపరేషన్ ఆక్టోపస్ 2.0”లో బట్టబయలు చేసింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 52 మందిని అరెస్ట్ చేయగా, అందులో 32 మంది బ్యాంక్ ఉద్యోగులు ఉండటం సంచలనంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా సుమారు 850 సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి రూ.150 కోట్లకు పైగా మోసాలకు పాల్పడింది. నిందితులు సుమారు 350 బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి డబ్బును మార్పిడి చేసి మనీలాండరింగ్ చేసినట్లు గుర్తించారు.IndusInd Bank, Bandhan Bank, Bank of Baroda వంటి బ్యాంకులలో పనిచేసే కొందరు అధికారులు కేవైసీ నిబంధనలను ఉల్లంఘించి నకిలీ “మ్యూల్ అకౌంట్లు” తెరవడంలో సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆపరేషన్‌లో మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక సహా 9 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్స్, ల్యాప్‌టాప్‌లు, షెల్ కంపెనీల స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.పోలీస్ కమిషనర్ V C Sajjanar, సైబర్ క్రైమ్ డీసీపీ V Aravind Babu పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ నేరాలకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
