తెలంగాణలో తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో జనగణన నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర జనగణన డైరెక్టర్ Bharati Holikeri షెడ్యూల్‌ను ప్రకటించారు.
మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ప్రజలు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. రెండో దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారు.తుది దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనగణన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడనున్నాయి.
