BRS పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ T. Harish Rao ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

తన ట్వీట్లో బీఆర్ఎస్ను ప్రజా ఉద్యమ పతాకంగా పేర్కొంటూ, తెలంగాణ సాధనలో పార్టీ పాత్రను గుర్తుచేశారు. “సంక్షేమం తగ్గి, అభివృద్ధి నిలిచిపోయిన పరిస్థితుల్లో ప్రజల గొంతు ఒక్కటే… ‘రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి’ అని మార్మోగుతోంది” అంటూ వ్యాఖ్యానించారు.ఉద్యమం నుంచి అధికారంలోకి, అక్కడి నుంచి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలిచిందని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి మళ్లీ పుంజుకునే రోజులు దూరంలో లేవని ధీమా వ్యక్తం చేశారు.
