తెలంగాణలో జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ప్రతి కుటుంబం తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu పిలుపునిచ్చారు. ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో ఆయన స్వయంగా వెబ్సైట్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు ఆన్లైన్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవడం వల్ల జనగణన ప్రక్రియ సులభతరం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.జనగణనలో సేకరించిన ఖచ్చితమైన సమాచారం ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధికారులు పాల్గొన్నారు.
