మధ్యప్రదేశ్‌లోని Gwalior లో జరిగిన ఒక విచిత్రమైన విడాకుల కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది. 28 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించేందుకు ఒక మహిళ, తన భర్త చెల్లినే అతని ‘రెండో భార్య’గా చూపిస్తూ కోర్టులో సాక్ష్యాలు సమర్పించింది.
1998లో వివాహం జరిగిన ఈ జంట మధ్య కాలక్రమేణా విభేదాలు పెరిగాయి. 2015 నుంచి ఇద్దరూ వేరుగా ఉంటుండగా, 2021లో మహిళ విడాకుల కోసం కుటుంబ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా, తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఒక కుటుంబ ఫోటోను సాక్ష్యంగా సమర్పించింది.ఆ ఫోటోలో భర్త పక్కన ఉన్న మహిళను ‘రెండో భార్య’గా పేర్కొనడంతో, కోర్టు ఆమె వాదనను సమర్థించి ఎక్స్‌పార్టీగా విడాకులు మంజూరు చేసింది. అయితే తర్వాత ఆ ఫోటోలో ఉన్నది తన చెల్లేనని భర్త వెల్లడిస్తూ, ఈ తీర్పును Madhya Pradesh High Court గ్వాలియర్ బెంచ్‌లో సవాలు చేశాడు.తనకు వాదించే అవకాశం ఇవ్వకుండా, తప్పుడు సమాచారంతో తీర్పు పొందిందని భర్త ఆరోపించగా, ప్రస్తుతం హైకోర్టు ఈ కేసును విచారిస్తోంది.
