Singapore లో కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకొని విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సింగపూర్ డిజిటల్ పాలన విధానాలపై మంత్రుల బృందం సమగ్రంగా అధ్యయనం చేసింది.

“Digital to the Core, Serves with Heart” నినాదంతో అమలవుతున్న సింగపూర్ డిజిటల్ గవర్నమెంట్ స్ట్రాటజీ, Singpass వంటి సురక్షిత డిజిటల్ గుర్తింపు వ్యవస్థ, అలాగే HealthHub ద్వారా పౌరుల ఆరోగ్య సమాచారం నిర్వహణ వంటి అంశాలను నిపుణుడు Tan Eng Pheng వివరించారు.

స్మార్ట్ సిటీ మౌలిక వసతులు, డిజిటల్ పబ్లిక్ సర్వీసుల అమలు విధానాలను ఆంధ్రప్రదేశ్లో “స్వర్ణాంధ్ర-2047” విజన్లో ఎలా అమలు చేయవచ్చో మంత్రులు అధ్యయనం చేశారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న మంత్రులకు Singapore Cooperation Enterprise సర్టిఫికెట్లు ప్రదానం చేసింది.ఈ శిక్షణలో అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
