చలానాల భారం భరించలేక బైక్ దహనం చేసిన తండ్రి.

April 27, 2026 11:26 AM

Visakhapatnam లో ట్రాఫిక్ చలానాలతో విసిగిపోయిన ఓ తండ్రి తన కుమారుడి బైక్‌ను తగలబెట్టిన ఘటన కలకలం రేపింది. వేపగుంట సమీపంలోని బంటాకాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన కుమారుడి కోసం ఏడాది క్రితం బైక్ కొనిచ్చాడు.

అయితే కుమారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనం నడపడంతో పలుమార్లు చలానాలు వచ్చాయి. గతంలో జరిగిన ప్రమాదంతో వైద్య ఖర్చుల కోసం తండ్రి సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇటీవల ట్రిపుల్ రైడింగ్ కారణంగా మరోసారి జరిమానా పడడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి, కాలనీకి దూరంగా బైక్ తీసుకెళ్లి దహనం చేశాడు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media