Hyderabad లో విడి నూనె (Loose Oil) విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు H-FAST బృందం ఆధ్వర్యంలో బేగంబజార్‌లో నూనె వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన Vaibhav Raghunath Gaikwad వ్యాపారులకు 15 రోజుల గడువు విధించారు. ఈ గడువులోగా విడి నూనె విక్రయాలను పూర్తిగా నిలిపివేసి, ప్యాకేజింగ్ మరియు లేబిలింగ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.గడువు అనంతరం కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత (BNS), ఆహార భద్రత చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్యాకేజింగ్ తప్పనిసరి చేయడంతో పాటు, ప్రతి ఉత్పత్తిపై తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్, FSSAI లైసెన్స్ వివరాలు ఉండాలని సూచించారు.నూనెల్లో కల్తీ చేస్తే లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండి, విడి నూనె కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

