Forever Living అనే డిజిటల్ మార్కెటింగ్ పేరిట కోట్ల మోసం..

April 27, 2026 12:10 PM

Hyderabad లో డిజిటల్ మార్కెటింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతో అమాయకులను మోసం చేస్తున్న పెద్ద ఎంఎల్ఎం (MLM) రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో Harish Kumar Singla అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను Forever Living Imports India Pvt Ltd లో కంట్రీ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

పోలీసుల ప్రకారం, సోషల్ మీడియా ద్వారా విలాసవంతమైన జీవితం చూపిస్తూ యువత, గృహిణులను ఆకర్షించి, రిజిస్ట్రేషన్ ఫీజులు (₹199–₹249) వసూలు చేయడంతో పాటు ‘స్లో, మీడియం, ఫాస్ట్ ట్రాక్’ ప్యాకేజీల పేరిట భారీగా డబ్బులు దోచుకున్నాడు. ఉత్పత్తుల అమ్మకాల కంటే కొత్త సభ్యులను చేర్చడం ద్వారా ఆదాయం వస్తుందని నమ్మించి మనీ సర్క్యులేషన్ స్కీమ్ నడిపినట్లు గుర్తించారు.ఇప్పటికే ముగ్గురు స్థానిక ఏజెంట్లు కూడా అరెస్ట్ కాగా, ఒక మెర్సిడెస్ బెంజ్ కారు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సుమారు ₹3 కోట్లను ఫ్రీజ్ చేశారు.ఈ ఆపరేషన్‌ను V C Sajjanar పర్యవేక్షణలో పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. ప్రజలు ఇలాంటి తక్షణ లాభాల వాగ్దానాలతో వచ్చే MLM స్కీమ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media