Nalgonda జిల్లాలో గురుకుల విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో కనగల్‌లోని బాలుర గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి కార్యదర్శి బి. సైదులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలలో కూడా ప్రావీణ్యం సాధించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ సమ్మర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్ 24 నుంచి మే 8 వరకు కొనసాగనున్న ఈ శిక్షణలో క్రాఫ్ట్స్, గేమ్స్, స్పోర్ట్స్, కంప్యూటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని అధికారులు కోరారు.

