కొఠియా గ్రామాల వివాదంపై CM జోక్యం కోరిన లోక్‌సత్తా

April 27, 2026 3:53 PM

విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దులో ఉన్న కొఠియా 21 గ్రామాల వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలు ప్రతి రోజు అనిశ్చిత పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా–ఏపీ మధ్య కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.జనగణన ప్రక్రియలో కూడా వివాదం ప్రభావం చూపుతోందని, గంజాయి భద్ర పంచాయతీ పరిధిలోని గిరిజనులు ఒడిశా అధికారులకు సహకరించలేదని తెలిపారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిపించాలని డిమాండ్ చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media