విజయనగరంనగరంలో అల్లర్లు సృష్టించే Youthకు Police వార్నింగ్

April 27, 2026 4:12 PM

విజయనగరం నగరంలో తరచూ అల్లర్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు SP A.R. దామోదర్ హెచ్చరించారు. జొన్నగుడ్డి, లంకాపట్నం ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

మద్యం, గంజాయి మత్తులో రోడ్లపై అల్లర్లు సృష్టించే యువతకు పోలీస్ స్టైల్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.ఇటీవల పావాడ హరినాథ్ హత్య అనంతరం జరిగిన అంత్యక్రియల్లో కొందరు యువకులు చేసిన వీరంగం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media