Bharat Rashtra Samithi (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవాల ముగింపు ప్రత్యేక సమావేశం హైదరాబాద్‌లోని Telangana Bhavanలో ప్రారంభమైంది. పార్టీ అధినేత K. Chandrashekar Rao అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది.
ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు K. T. Rama Raoతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై కీలక చర్చలు ఈ సమావేశంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
