అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీ జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ నవజ్యోతి మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం ప్రాణాలకు ముప్పు అని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక అవగాహన కల్పించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు.
