ఆంధ్రప్రదేశ్‌లోని Visakhapatnam నగరం త్వరలోనే next-level టెక్ హబ్‌గా మారబోతోంది. Google ఆధ్వర్యంలో భారీ AI డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు నేడు గ్రాండ్ ఫౌండేషన్ వేడుక నిర్వహించారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, మంత్రి Nara Lokesh ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ మూడు భారీ డేటా సెంటర్లను అభివృద్ధి చేయనుంది. విశాఖ జిల్లా తర్లువాడ, అడవివరం ప్రాంతాలు మరియు అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో ఈ సెంటర్లు నిర్మించబడనున్నాయి.ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాల భూమిని కేటాయించింది. 2028 నాటికి ఈ మూడు డేటా సెంటర్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో గూగుల్ ముందుకెళ్తోంది.ఈ మెగా ప్రాజెక్ట్ అమలైతే, విశాఖ నగరం ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు పోటీగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

