తెలంగాణలో పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న వేళ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఓ ఆసక్తికరమైన ఆఫర్ చర్చనీయాంశమైంది. Airtel ప్రతినిధులు వినూత్న ప్రచారంతో ముందుకొచ్చారు.
కేవలం రూ.350 రీచార్జ్‌తో కొత్త సిమ్ తీసుకున్నా లేదా నెట్‌వర్క్‌ను Airtelకు పోర్ట్ చేసుకున్నా, లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. పెట్రోల్ బంకుల వద్ద “No Stock” బోర్డులు కనిపిస్తున్న సమయంలో, ఈ ఆఫర్‌కు ప్రజలు భారీగా స్పందిస్తున్నారు.పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి ఉండటం కంటే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడమే మంచిదని భావించి, పలువురు వినియోగదారులు Airtel వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం.
