జాయింట్ లేకుండా జాతీయ జెండా..నేతన్నకు ప్రశంసలు

April 28, 2026 11:54 AM

ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరానికి చెందిన నేతన్న ఆర్‌.ఆర్‌. సత్యనారాయణ తన అపూర్వ ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల పాటు నిరంతర శ్రమ, అంకితభావంతో ఆయన మగ్గంపై నేరుగా జాయింట్ లేకుండా భారత జాతీయ జెండాను అల్లారు.

సాధారణంగా మూడు రంగుల వస్త్రాలను కుట్టి తయారు చేసే జెండాకు భిన్నంగా, ఎక్కడా ఒక్క జాయింట్ కూడా లేకుండా ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం విశేషం. అంతేకాదు, 2400 నూలు పోగులతో 24 spokes కలిగిన అశోక చక్రాన్ని అత్యంత నైపుణ్యంతో రూపొందించారు.ఈ అరుదైన కళాఖండం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ప్రముఖ నాయకుడు Shashi Tharoor ఈ కృషిని అభినందిస్తూ ప్రభుత్వ సహాయం అందించాలని కోరగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh నేతన్నల నైపుణ్యానికి ఇది గొప్ప ఉదాహరణగా కొనియాడారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media