రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఏప్రిల్ 27న డిమాండ్ కంటే ఎక్కువగా ఇంధనం సరఫరా చేసినట్లు వెల్లడించారు.

సగటున రోజుకు 5,883 కిలో లీటర్ల పెట్రోల్, 7,348 కిలో లీటర్ల డీజిల్ డిమాండ్ ఉండగా, 27న 11,490 కిలో లీటర్ల పెట్రోల్, 18,449 కిలో లీటర్ల డీజిల్ సరఫరా చేసినట్లు తెలిపారు. మొత్తం 29,939 కిలో లీటర్ల ఇంధనం పంపిణీ చేసినట్లు వివరించారు.ఇంధన సరఫరాపై క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీలతో కలిసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతున్నదని తెలిపారు. అపోహలకు లోనవకుండా ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని సూచించారు.ఈ ప్రకటనను హైదరాబాద్ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జారీ చేశారు.

