మహారాష్ట్రలో మహిళలపై దారుణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమ్రావతి ఘటన తర్వాత తాజాగా కొల్హాపూర్లో మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.

పోలీసులు 22 ఏళ్ల షాహిద్ సమీర్ సనాడిని అరెస్ట్ చేశారు. ఫార్మసీ విద్యార్థి అయిన అతడు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని, వారిని లాడ్జ్లకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలను రహస్యంగా వీడియోలు తీసి, తరువాత బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఏప్రిల్ 26న 20 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై వీడియోలను బయటపెడతానని బెదిరిస్తూ మానసిక, శారీరకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక కోర్టు నిందితుడిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.ఇదిలా ఉండగా, నిందితుడు సుమారు 10 మంది యువతులను ఇదే విధంగా టార్గెట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర బాధితులు కూడా ముందుకు రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.ఈ కేసు కొద్ది రోజుల క్రితం అమ్రావతిలో బయటపడిన భారీ లైంగిక దోపిడీ ఘటనను గుర్తుకు తెస్తోంది. అక్కడ ఒక వ్యక్తి వందలాది మైనర్ బాలికలను మోసం చేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
