యూసఫ్‌గూడలో ఏళ్లనాటి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం

April 28, 2026 3:43 PM

ఏళ్లుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది. జలమండలి ఆధ్వర్యంలో కృష్ణానగర్ మెయిన్ రోడ్డులో 450 మిల్లీమీటర్ల వ్యాసం గల కొత్త RCC NP4 సీవరేజ్ పైపులైన్ నిర్మాణం చేపట్టారు.

దాదాపు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత 300 మి.మీ పైపులైన్ పూర్తిగా దెబ్బతిని, సిల్ట్‌తో నిండిపోవడంతో సీవరేజ్ ఓవర్‌ఫ్లోలు, దుర్వాసన, కలుషిత నీటి సమస్యలు తీవ్రంగా పెరిగాయి. ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలోని B, C బ్లాక్స్ నుంచి రోజూ 15–20 ఫిర్యాదులు నమోదవుతున్నాయి.

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని అధికారులు కొత్తగా 450 మి.మీ బలమైన పైపులైన్‌ను 800 మి.మీ K-మెయిన్ సీవరేజ్ లైన్‌కు అనుసంధానం చేసే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 25% పనులు పూర్తయ్యాయి.సుమారు రూ.75 లక్షల వ్యయంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌ను GHMC, ట్రాఫిక్ పోలీస్, ఇతర శాఖల సమన్వయంతో రాత్రి వేళల్లో వేగంగా అమలు చేస్తున్నారు. వచ్చే 30 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలు పూర్తిగా నివారించబడటంతో పాటు, ప్రాంతంలో పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media