బహదూర్‌పురాలో అగ్నిప్రమాదం… సోఫా వర్క్‌షాప్ దగ్ధం

April 28, 2026 3:52 PM

నగరంలోని బహదూర్‌పురా పరిధిలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. కిషన్ బాగ్ ప్రాంతంలోని ఒక సోఫా వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో వర్క్‌షాప్‌లో ఉన్న ఫర్నిచర్, సోఫా సెట్లు, ఫ్లైవుడ్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media