సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి రెచ్చిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 13 బంతుల్లో రెండు పోర్లు, రెండు సిక్సులతో 35 పరుగులు, ట్రావిస్ హెడ్ 19 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 38 పరుగులతో ఆరంభంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు, నితీశ్ రెడ్డి 13 బంతుల్లో 29 పరుగులు నాటౌట్ తో ఆకట్టుకున్నారు. పంజాబ్ ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు మిస్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు.
