హైదరాబాద్ లో ఆ అధికారి భార్య దారుణ హత్య

May 8, 2026 4:17 PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పని చేసే వారే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో ఏడెనిమిది నెలల పాటు కల్పన, ఆమె గ్యాంగ్ ఎదురుచూసినట్లు తెలుస్తోంది. ఇంటి వెనుక నుంచి వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారు. కల్పనతో సహా మొత్తం ముగ్గురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత పారిపోయే క్రమంలో ఒక నిందితుడి క్యాప్ కిందపడటంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. సునంద భర్త వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. సునంద ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన కల్పన, ఈ విషయాన్ని తన గ్యాంగుకు చేరవేసి వారిని రప్పించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ హత్య జరిగింది. కల్పన నేపాల్‌కు చెందిన మహిళ. డబ్బులు, బంగారం చోరీ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నేపాలీ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కొన్ని ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సజ్జనార్ అన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media