బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి అలియాస్ వెంకట అశ్విని రెడ్డి ఎంగేజ్మెంట్ రింగ్ తో కూడిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే ఎన్నారై, తనను పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం చేసిందని హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 2018 నుంచి తన నుంచి సుమారు రూ.9.35 కోట్లు వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో అషు రెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలని, తమపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ అషు రెడ్డి, ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ఇంతలో అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంగేజ్ మెంట్ ఫొటోలను పంచుకున్నారు. తీవ్రమైన ఆరోపణలతో కేసు విచారణ జరుగుతున్న కీలక సమయంలో ఈ ఎంగేజ్మెంట్ విషయం బయటపడింది. ఇంతకూ ఇది నిజమైనదా లేక ఏదైనా ప్రమోషన్స్ లో భాగమా అన్నది తెలియాల్సి ఉంది.
