రాజస్థాన్ ఘోర ఓటమి.. టైటాన్స్ మరింత టాప్

May 10, 2026 8:16 AM

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌ను 77 పరుగుల భారీ తేడాతో ఓడించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్ధసెంచరీలతో గుజరాత్ 229 పరుగుల భారీ స్కోరు సాధించగా, లక్ష్యఛేదనలో రషీద్ ఖాన్ (4/33) అద్భుత బౌలింగ్ తో రాజస్థాన్‌ను కుప్పకూల్చాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుగానే ఛేదన ప్రారంభించింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 36), ధ్రువ్ జురెల్ (10 బంతుల్లో 24) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్లకు 78 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. రషీద్ ఖాన్ జురెల్‌ను, ఆ తర్వాత ఫెరీరా, శుభమ్ దూబేలను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. చివర్లో రవీంద్ర జడేజా (38) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి రాజస్థాన్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media