కాకినాడలో కానిస్టేబుల్‌ దారుణ హత్య

May 11, 2026 11:28 AM

కాకినాడ నగరంలో దారుణ హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్ క్రాస్ భవనం సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మృతుడిని ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావు (46)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media