రెండు ఏనుగుల గొడవ.. మహిళ ప్రాణం తీసింది!!

May 18, 2026 7:56 PM

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన దుబారే ఎలిఫెంట్ క్యాంప్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు ఏనుగులు గొడవ పడుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కొడగు జిల్లాలో జరిగింది. దుబారే శిబిరంలోని ఏనుగులకు మావటీలు కొలనులో స్నానం చేయిస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా రెండు ఏనుగులు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ తీవ్రంగా ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ ఏనుగు అదుపుతప్పి పర్యాటకుల వైపు దూసుకొచ్చి, చెన్నైకి చెందిన మహిళపై పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంకు రోజూ వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media