బంగారం ధరలకు బ్రేక్‌.. కొనుగోళ్లలో తగ్గుదల

May 19, 2026 11:34 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా బంగారం ధరలు మాత్రం వరుసగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు దిగివస్తుండటంతో మార్కెట్ నిపుణుల అంచనాలు తప్పుతున్నాయి. యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భావించినా పరిస్థితి భిన్నంగా మారింది.

కాల్పుల విరమణ ఒప్పందం అవకాశాలు కనిపించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరగడం, పెట్రోలు-డీజిల్ భారం అధికమవుతుండటంతో ప్రజలు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దాంతో బంగారం కొనుగోళ్లపై ప్రభావం పడింది.

ఆర్థిక పరిస్థితులపై ఆందోళన పెరగడంతో ప్రజలు నగదును జాగ్రత్తగా వినియోగిస్తున్నారు. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మదుపు రూపంలోనూ కొనుగోళ్లు తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కూడా మందగించనున్న నేపథ్యంలో ఆ అవసరాల కోసం కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. భవిష్యత్తులో జీవన వ్యయం మరింత పెరిగే అవకాశముందన్న భావనతో ప్రజలు ఖర్చులను నియంత్రిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం ఆరు గంటలకు నమోదైన ధరల ప్రకారం..
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా నమోదైంది.
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద కొనసాగుతోంది.
కిలో వెండి ధర రూ.3,00,100కు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media