బ్రిటన్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో 23 ఏళ్ల భారత సంతతి యువకుడు తుషార్ కుమార్ గెలుపొంది చరిత్ర సృష్టించారు. బ్రిటన్ చరిత్రలో మేయర్ పీఠాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఆయన ఘనత సాధించారు. తూర్పు ఇంగ్లండ్‌లోని ‘ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్’ పట్టణ మేయర్‌గా ఎన్నికయ్యారు.
లండన్‌లోని ప్రసిద్ధ కింగ్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అభ్యసించారు. మూడేళ్ల క్రితం ఇదే టౌన్ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేరిన తుషార్‌కు, గతంలో డెప్యూటీ మేయర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తుషార్ భారతదేశంలోనే జన్మించారు. ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం బ్రిటన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడింది.

