ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ, ఎంబీసీ వర్గాలకు చెందిన వృత్తిదారులు, బీసీఎల్ కుటుంబాలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బీసీ వర్గాల జీవనోపాధి మెరుగుపర్చే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వనుంది.
వర్గాల వారీగా ఉచిత యూనిట్లు
- సెలూన్లు (నాయీ బ్రాహ్మణులు) – 200 యూనిట్లు
- లాండ్రీ షాపులు (రజకులు) – 150 యూనిట్లు
- గోల్డ్ షాపులు (స్వర్ణకారులు) – 100 యూనిట్లు
- తెల్ల రేషన్ కార్డు ఉన్న గృహాలు – 100 యూనిట్లు
అర్హులైన లబ్ధిదారులు సంబంధిత పత్రాలతో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ (AE) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- కుల ధృవీకరణ పత్రం
- ప్రస్తుత కరెంట్ బిల్లు లేదా సర్వీస్ నంబర్
- ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్
అత్యంత వెనుకబడిన వర్గాల్లోని దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు సహా 32 ఉపకులాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని అధికారులు తెలిపారు.
అర్హులైన వృత్తిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

