కుర్చీ మడతపట్టి అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన షేక్ మహ్మద్ పాషా (64) కన్నుమూశారు. యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఎండ తీవ్రతకు తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయారు. అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆయనను యూట్యూబర్ వైజాగ్ సత్య ఇంటికి చేర్చారు. అయితే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలాడని భార్య ఆసియా సుల్తానా కన్నీటి పర్యంతమయ్యారు.
వరంగల్‌కు చెందిన పాషా, సుమారు 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి రహ్మత్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ‘కుర్చీ మడతపెట్టి’ అనే పదం వాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంలోని సాంగ్‌లో ఇదే పదాన్ని పాడే అవకాశం దక్కించుకున్నారు. ఆ పాటతో ఆయన మరింత ఫేమస్ అయ్యారు. మద్యానికి బానిసైన పాషా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు.

