తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

May 21, 2026 8:58 AM
Tirumala darshan timings

రుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. విద్యాసంస్థలకు మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు ముగియనుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ సర్వదర్శనం క్యూ లైన్ ను టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తిరిగి రాత్రి 8 గంటల నుంచి క్యూలైన్లోకి భక్తులను అనుమతించగ. గురువారం ఉదయం 7 గంటల సమయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 6-7 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 44,107 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు సమకూరింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media