మోదీ ‘Melodi’ గిఫ్ట్ ఎఫెక్ట్‌.. 5% జంప్‌ చేసిన పార్లే షేర్లు

May 21, 2026 1:54 PM

1983లో మార్కెట్లోకి వచ్చిన ‘మెలోడీ’ టాఫీ ఇప్పుడు గ్లోబల్ డిప్లమసీ సింబల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల ‘Melodi’ మీమ్‌ ట్రెండ్‌ తర్వాత.. రోమ్‌లో జరిగిన తాజా భేటీలో మోదీ ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ బజ్‌ స్టాక్ మార్కెట్‌పైనా ప్రభావం చూపించింది. ట్రేడింగ్‌లో ‘పార్లే ఇండస్ట్రీస్’ షేర్లు ఏకంగా 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ‘మెలోడీ’ చాక్లెట్లు తయారుచేసేది ‘పార్లే ప్రొడక్ట్స్’. కానీ మార్కెట్లో లాభపడింది మాత్రం ‘పార్లే ఇండస్ట్రీస్’. ఈ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ‘పార్లే’ అనే పేరు ఒకటే ఉండటంతో ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అయ్యి షేర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ట్రెండ్‌ వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media