పోలీసుల వద్దకు విష్ణు ప్రియ.. ఆమెపై ఫిర్యాదు

May 22, 2026 8:47 PM
Anchor-vishnupriya

యాంకర్, నటి విష్ణుప్రియ సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసభ్యకరమైన కంటెంట్ పెట్టే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ‘ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై ఆమె హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియ కంప్లైంట్‌తో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సదరు ఛానల్ నడిపే వ్యక్తి ఒక అమ్మాయి అయ్యుండి కూడా, సెలబ్రిటీ మహిళల క్యారెక్టర్‌ను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని విష్ణుప్రియ మండిపడ్డారు. తాము ఇండస్ట్రీకి వచ్చింది ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికని, నిజంగా తప్పు చేసినప్పుడు విమర్శిస్తే తలదించుకుని ఒప్పుకుంటామని అన్నారు. కానీ, డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది అంటూ అసత్య ఆరోపణలు చేస్తుంటే ఇంకా నోరు మూసుకుని కూర్చోలేనన్నారు విష్ణు ప్రియ.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media