ఆధునిక మనుషులు…ఆటవిక మనస్తత్వాలు

May 23, 2026 4:26 PM

2026 లో ఇండియా డిజిటల్ highways ను నిర్మిస్తోంది. Space missions launch చేస్తోంది. భారత్ Global Super Powerఅవుతుందని గర్వంగా చెప్పుకుంటున్నాం. అయినా ఈ అభివృద్ధి వెలుగుల వెనుకు ఏదో మసక, దేశం మొత్తం సిగ్గు పడాల్సిన నిజం. అదే వరకట్న వేధింపులు…వాటికి  బలవుతున్న ఆడబిడ్డలు.

ఇది ఎక్కడో మారుమూల పల్లెల్లోనో…నిరక్షరాస్యుల్లోనో కాదు.సంపన్న కుటుంబాల్లో, culture, prestige అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ల ఇళ్లల్లోనూ జరుగుతున్నాయి. ఇటీవల భోపాల్ లో జరిగిన ట్విషా శర్మ, గ్రేటర్ నోయిడాలో జరిగిన దీపికా నగర్ మరణాలే దీనికి ఉదాహరణ. మనం మర్చిపోయే కఠిన నిజాలను ఈ మరణాలు మరోసారి గుర్తుకు తెచ్చాయి. ఇవి కేవలం కుటుంబ కలహాలు అని కొట్టిపారేయడానికి లేదు. మన సమాజంలో వివాహం commercial గా మారుతుందని హెచ్చరించే సంఘటనలు. ఆడపిల్లల బంగారం, నగలు, ఆస్తులు బట్టి అత్తగారింట్లో వారికి విలువనిస్తున్నారు.

ట్విషా శర్మ వరకట్నం వేధింపులకు గురైనట్టు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండడంతో ఆమె మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయ. ట్విషా శర్మ శరీరంపై గాయాలున్నాయి. ఆమె కుటుంబ సభ్యులు రీపోస్ట్ మార్టమ్ కోరుతున్నారు. కానీ దర్యాప్తు సాఫీగా జరగడం లేదు. ఇదిలా వుంటే…గ్రేటర్ నోయిడాలో జరిగిన దీపికా నగర్ హత్య మరో దారుణం. అత్తింటి వారు అదనపు కట్నం, లగ్జరీ SUV కోసం వేధించినట్టు ఆమె కుటుంబ సభ్యలు చెబుతున్నారు. దీపికా మృత దేహంపై తీవ్రమైన గాయాలున్నాయి. Spleen ఛిద్రమై ఉంది. మెదడులో రక్తం గడ్డకట్టినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. 

రెండు ఇళ్లు…రెండు చావులు…దుఖం:లో మునిగిపోయిన రెండు కుటుంబాలు.  ఈ రెండు చావులకు కారణం  ఒక్కటే. అదే వరకట్నం. NCRB తాజా నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం వేలాది వరకట్నపు చావులు రికార్డవుతున్నాయి. అంటే రోజుకు 15 మంది మహిళలు  వరకట్న వేధింపులకు బలవుతున్నారని. ఇంత మంది చనిపోవడమనేది కాదు ఇక్కడ విషాదం…ఇది ఎంత సాధారణ విషయంగా మారిందనేది అసలు విషాదం. ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పెళ్లిల్లు చేయడానికి నానా కష్టాలు పడుతుంటారు. సమాజంలో గౌరవం కోసం ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ఆడంబరంగా పెళ్లిల్లు చేస్తుంటారు. వారి పెళ్లి కోసం అప్పులు చేస్తుంటారు. బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. బంగారం కొంటారు. ఉన్న ఆస్తి అమ్ముతుంటారు.  అన్ని ఇచ్చిన తర్వాత కూడా అత్తింటి వారి నుంచి అవే డిమాండ్లు. అవే సూటి పోటి మాటలు. అవే వేధింపులు. మీ అమ్మ నాన్న ఏమిచ్చారు? కారు ఎప్పుడు వస్తుంది.? ఇంకా డబ్బులు కావాలని అడుగు. ఇవే మాటలు.

ఆశ్చర్యం ఏంటంటే..? ఇక్కడ సమాజం మొత్తం అమ్మాయిల వెంటే ఉంటుంది. కాకపోతే వారిచ్చే మద్దతు, చెప్పే మాటలు కేవలం ఉపశమనానికి మాత్రమే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. పెళ్లంటేనే కాంప్రమైజ్..సర్దుకుపో..ఇంటి గౌరవం గురించి ఆలోచించు…పెల్లి కావాల్సిన చెల్లెలును గుర్తు తెచ్చుకో… అంటూ మాటలు చెబుతుంటారు. ‘కొంచెం సర్దుకు పో’..అనే ఈ మాటలే ఎంతో మంది జీవితాలను సైలెంట్ గా నాశనం చేస్తున్నాయి.

వరకట్నం గతంలో లాగా ఇప్పుడు డైరెక్ట్ డిమాండ్ కాదు..అది కూడా ఆధునికతను సంతరించుకుంది. అది gifts, expectations, customs అంటూ కొత్త పేర్లతో పిలవబడుతుంది. ఆచారం, సాంప్రదాయం ముసుగులో దోపిడి జరుగుతుంది.

ఇటీవల జరిగిన ట్విషా శర్మ, దీపికా నగర్ కేసులో రెండు కుటుంబాలు కూడా బాగా చదువుకున్న, పలుకుబడి కలిగినవి. అయినా వరకట్నం పేరుతో వేధించారు. వారి చావులకు కారణమయ్యారు. ఇదంతా చూస్తుంటే చదువు ఈ పితృస్వామ్య వ్యవస్థను రూపుమాపడంలో ఫెయిల్ అయ్యింది అని అర్ధమవుతుంది . Degrees పెరిగినవి, Salaries పెరిగినవి. Life style మారింది. కానీ Mindsets మాత్రం ఇంకా భూస్వామ్య విధానంలోనే ఉంది.

ప్రతి Dowry death పై Social media లో విపరీతమైన స్పందన వస్తుంది. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. Candle marches జరుగుతాయి. రాజకీయా నాయకులు Statements ఇస్తుంటారు. కొన్ని రోజుల వరకు న్యూస్ చానళ్లలో చెవులు పగిలిపోయే Debates జరుగుతుంటాయి. అంతటితో ఆ కథ ముగస్తుంది. ఆ తర్వాత మరో ఆడబిడ్డ చనిపోయే వరకు అంతా Silent. భారతీయులకు ఉన్న అత్యంత ప్రమాదకరమైన అలవాటు క్షణికావేశం. ఆరంభశూరత్వం.

వరకట్న నిషేధానికి చట్టాలున్నాయి. వరకట్నం చావులకు చట్టాలున్నాయి. కానీ అమలు మాత్రం సరిగ్గా జరగడం లేదు. Investigations ఆలస్యం అవుతన్నాయి. బాధిత కుటుంబాలు బెదిరింపులకు గురవుతున్నారు. ఈ సమాజానికి దూరంగా గుట్టుగా బతుకుతున్నారు.  చాలా కుటుంబాలు తమ బిడ్డల ప్రాణాల కంటే సమాజంలో తమకున్న గౌరవమే ముఖ్యం అనుకుంటున్నారు.

అత్తగారింట్లో తమ బిడ్డ అనుభవిస్తున్న హింస కంటే కూడా అవమానం అంతకన్నా  హింసాత్మకంగా భావిస్తున్నారు. విడాకులను మరింత తీవ్రంగా, కళంకితంగా పరిగణిస్తున్నారు. వేధింపులపై  స్పష్టమైన సంకేతాలు కనిపించినప్పటికీ, తల్లిదండ్రులు తరచుగా తమ కుమార్తెలను “వివాహాన్ని కాపాడుకోమని” బుజ్జగిస్తుంటారు. ఈ మాటలే వారిని నిస్సహాయులను చేస్తుంది. చివరకు ప్రాణాలను తీస్తుంది.

వరకట్న వ్యతిరేక పోరాటం ఒక్క చట్టాలతోనే సాధ్యం కాదు..దీనికి సామాజిక ధైర్యం కూడా కావాలి. తల్లిదండ్రులు ఖర్చులకు వెరవకుండా ఆడంబరంగా వివాహాలు జరిపించడం..వాటిని గొప్పగా చూపించడం ఆపేయాలి. కొడుకులను Investment గా భావించడం మానుకోవాలి. యువకులు వరకట్నాన్ని ధైర్యంగా తిరస్కరించాలి. వరకట్నం వేధింపులకు గురవుతున్న అత్తగారింట్లో నుంచి ఏ మాత్రం ఆలోచించకుండా బయటకు వచ్చేలా మహిళలను ప్రోత్సహించాలి. మానవ ప్రాణాల కంటే కూడా వివాహాన్ని ఎక్కువగా గౌరవించడాన్ని సమాజం ఆపేయాలి. మానవ ప్రాణాలను పణంగా పెట్టి, వివాహాన్ని ఆరాధించడం సమాజం మానుకోవాలి.

ట్విషా శర్మ, దీపికా నగర్ మరణాలు కేవలం వరకట్న చావులు మాత్రమే కావు. ప్రసంగాలలో స్త్రీలను కీర్తిస్తూనే, సొంత ఇళ్లలోని వారిని రక్షించడంలో విఫలమయ్యే ఒక దేశపు కపటత్వాన్ని ప్రతిబింబించే అద్దాలు అవి. వివాహం తర్వాత కూడా డబ్బు కోసం తమ బిడ్డలు ప్రాణాలు కోల్పోతుంటే, ఒక దేశం తనను తాను ఆధునికమైనదిగా చెప్పుకోలేదు. భారతదేశానికి ఇప్పుడు కఠిన శిక్షలు మాత్రమే కాదు.. నైతిక పరివర్తన అవసరం. అప్పటివరకు..ప్రతి పెళ్లి ఊరేగింపు ఒక వేడుక కానే కాదు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media