21 మంది మహిళలను ఎలా మోసం చేశాడో!!

May 23, 2026 4:28 PM
fake police 21 woman trapped

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టెక్నాలజీని ఉపయోగించి ఒకరు ఏకంగా 21 మంది మహిళలను మోసం చేశారు. తనను తాను గుజరాత్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, ఏకంగా 21 మంది మహిళలను నిలువునా మోసగించాడు. ఈ కేసులో నిందితుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుకోవడం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. నిందితుడు సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా ఒంటరి మహిళలను, పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. తాను గుజరాత్ పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేస్తున్నానని వారికి పరిచయం చేసుకున్నాడు. బాధితులను నమ్మించడానికి నిందితుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను ఉపయోగించాడు. ఏఐ సాయంతో అత్యంత పకడ్బందీగా నకిలీ పోలీస్ ఐడెంటిటీ (ID) కార్డులు, ప్రభుత్వ అధికారిక నియామక పత్రాలు, పే స్లిప్స్ సృష్టించాడు. ఆ డాక్యుమెంట్లను చూస్తే ఎవరికైనా అవి ప్రభుత్వ కార్యాలయం నుంచి జారీ అయిన అసలైన పత్రాలుగానే అనిపించేలా డిజైన్ చేశాడు. వాటిని మహిళలకు పంపించి వారి పూర్తి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.

నమ్మేసిన మహిళలతో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. వారితో చనువు పెంచుకున్న తర్వాత, ఏదో ఒక అత్యవసర పరిస్థితి ఉందనో, లేదా పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నాననో, ఇన్వెస్ట్‌మెంట్ అనో నమ్మించి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 21 మంది మహిళల వద్ద నుంచి నగదు దండుకుని మోసానికి పాల్పడ్డాడు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ నకిలీ పోలీస్ బాగోతం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని పట్టుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media