తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని సూలూరు ప్రాంతంలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. చెరువులో ఓ మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘోర ఘటన దిగ్భ్రాంతిని, వేదనను కలిగించిందని, ఇలాంటి అమానవీయ నేరాలను సహించబోమన్నారు విజయ్. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సమగ్రంగా విచారణ జరిపి తక్షణమే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు.
ఈ హత్య తర్వాత కొత్త ప్రభుత్వంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. సీఎం విజయ్ పదవి చేపట్టిన 12 రోజుల్లోనే నేరాలు పెరిగాయని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. ఈ కేసులో కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేయడానికి తమిళనాడు డీజీపీ స్వయంగా కోయంబత్తూర్ వెళ్లారు.

