ముత్యపు చిప్పల కోసం నదిలో దిగి

May 24, 2026 11:37 PM
karnataka-river-tragedy

ముత్యపు చిప్పల కోసం నదిలోకి దిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని వెంకటాపుర నదిలో ముత్యపు చిప్పలు సేకరించేందుకు వెళ్లిన మంది నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

శిరాలి ప్రాంతంలోని పడుశిరాలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఆదివారం వెంకటాపుర నదిలో ముత్యపు చిప్పలు సేకరించేందుకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపుతప్పి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, భట్కళ్ గ్రామీణ పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మరణించినవారిని లక్ష్మీ మహాదేవ నాయక్ (38), లక్ష్మీ శివరామ్ నాయక్ (39), ఉమేష్ మంజునాథ్ నాయక్ (42), మస్తమ్మ మంజునాథ్ నాయక్ (43), లక్ష్మీ అన్నప్ప నాయక్ (44), జ్యోతి నాగప్ప నాయక్ (37), మాలతి జట్టప్ప నాయక్ (38)గా గుర్తించారు. వీరి మృతదేహాలను వెలికితీసి భట్కళ్, మురుడేశ్వర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. మరో ముగ్గురు మాదేవ జట్టప్ప నాయక్ (52), మంజమ్మ గొట్ట నాయక్ (50), నాగరత్న పరమేశ్వర్ నాయక్ (40) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media