హైదరాబాద్: పసిడి ప్రియులకు తీపికబురు అందింది. బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు ఇతర కారణాల వల్ల మధ్యాహ్నానికి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. తగ్గిన ధరలతో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని జ్యువెలరీ వ్యాపారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,230 తగ్గి రూ.1,56,060కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,050 తగ్గి రూ.1,43,050 వద్ద నమోదైంది.
వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.5 వేల తగ్గడంతో ధర రూ.2,85,000కు చేరింది. తగ్గిన ధరలతో కొనుగోలుదారులు నగల దుకాణాలవైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

