కర్ణాటక: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలూకా తుమకుర్లహళ్లి వద్ద లారీ కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
బళ్లారి–బెంగళూరు రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చెల్లకెరె ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మృతులను మల్లికార్జున, సోము, రుద్రేశ్, రాఘవేంద్ర, ప్రమోద్లుగా పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

