Benjamin Netanyahu మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు Israelకు దూరంగా ఉంటున్నా, India మాత్రం తమకు అండగా నిలుస్తోందని అన్నారు.
ఒక కార్యక్రమంలో మాట్లాడిన నెతన్యాహు.. చాలా దేశాలు ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయాలని ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ బలమైన వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోందని చెప్పారు.
“ప్రపంచం ఒకవైపు ఉన్నా, భారత్ మాత్రం మా వైపు నిలిచింది. భారత్ చూపిస్తున్న మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనది” అని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన మిత్రదేశాల్లో భారత్ ఒకటని అన్నారు.
అంతేకాకుండా ఇతర దేశాలతో పోలిస్తే తనకు భారత్‌లోనే ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలోనూ భారత్‌పై ప్రశంసలు
భారత్‌ను నెతన్యాహు ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో భారత్‌తో ఇజ్రాయెల్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఆయన ప్రస్తావించారు.
ఇరు దేశాల మధ్య రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, భద్రత తదితర రంగాల్లో సహకారం పెరుగుతోందని పలుమార్లు పేర్కొన్నారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలపడుతున్నాయని కూడా నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

