పుణె: నటి, మోడల్ ట్విషా శర్మ మృతికేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
ట్విషా అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆధారాలతో చెలగాటం ఆడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ట్విషా భర్త సమర్థ్ సింగ్ కస్టడీలో ఉన్నారు.
మే 12న భోపాల్‌లోని ఇంట్లో ట్విషా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. తొలుత ఇది వరకట్న వేధింపుల కేసుగా కనిపించినా, ఇప్పుడు ఆధారాల మార్పిడి, డిజిటల్ రికార్డుల తారుమారు, నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు సాగుతోంది.
ట్విషా కుటుంబం చేసిన ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. వరకట్నం, రూ.20 లక్షల విలువైన షేర్ల బదిలీపై ఒత్తిడి, గర్భస్రావానికి బలవంతం చేశారనే ఆరోపణలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇక ట్విషా చివరి 40 నిమిషాల కదలికలను సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ రికార్డులు, వై-ఫై లాగ్స్ ఆధారంగా సీబీఐ పునర్నిర్మిస్తోంది.
ట్విషా మరణానికి ముందు ఏం జరిగింది? ఆ తర్వాత ఆధారాలు మార్చారా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతోంది.

