ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, పశువుల కాపర్లు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిల్చోవద్దని సూచించింది.
తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అవసరం లేకపోతే మధ్యాహ్న వేళ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా మంచినీరు తాగుతూ వడదెబ్బ, డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్త పడాలని కోరుతున్నారు.

