₹2,000 కోట్ల విడుదల.. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిల చెల్లింపు

May 30, 2026 12:37 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్ బకాయిలు, మే 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ క్లెయిమ్‌ల చెల్లింపుల కోసం ₹2,000 కోట్లు విడుదల చేసింది.

ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం ₹6,000 కోట్ల బకాయిల్లో ఇది తొలి విడత. 100 రోజుల్లో దశలవారీగా అన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక శాఖ తొలి విడత నిధులు విడుదల చేసింది.

ఈ నిధులతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించారు. అలాగే మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

మిగిలిన ₹4,000 కోట్ల బకాయిలను కూడా గడువులోగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media